AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ లోకి కంది శ్రీనివాస రెడ్డి!.. దాదాపు ఖరారు

ఆదిలాబాద్ నాయకులు, కేఎస్సార్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తుంది. ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తుంది. కాంగ్రెస్ ఆహ్వానంపై కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన కంది శ్రీనివాస రెడ్డి .. హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి రాంచంద్రారెడ్డిని కంది శ్రీనివాస రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చల విషయాన్ని సీఆర్ఆర్ కు వివరించినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిక నిర్ణయాన్ని రాంచంద్రారెడ్డి అభినందినట్టు సమాచారం. అంతేకాకుండా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజీద్ ఖాన్ ను కూడా కంది శ్రీనివాసరెడ్డి కలిశారు. అయితే కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై అధికారిక ప్రకటన రాలేదు. కాగా సీఆర్ఆర్ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే కంది శ్రీనివాస రెడ్డి ఆదిలాబాద్ లో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు.

ANN TOP 10