మణిపూర్ లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.మణిపూర్ లో నెలకొన్న హింసాకాండ నేపథ్యంలో అలర్టైన గవర్నమెంట్.. అక్కడున్న తెలంగాణతో పాటు ఏపీ స్టూడెంట్స్, పౌరులను రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని పంపించింది. ఇందుకోసం ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్ తో పాటు హైదరాబాద్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటున్నారు.మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు, విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులతో తెలంగాణ డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.









