AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ బ్లడ్‌ గ్రూప్ .. లక్షల్లో ఒకరికి మాత్రమే

ప్రపంచంలో అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్‌గా ‘బాంబే బ్లడ్‌ గ్రూప్‌’నకు పేరుంది. లక్షల్లో ఒకరికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ రక్తం దొరకటం చాలా కష్టం. అత్యంత అరుదుగా లభిస్తుండటంతో ఈ బ్లడ్ గ్రూప్‌కు డిమాండ్ ఎక్కువ. అయితే అరుదుగా లభించే ఈ బ్లడ్‌ గ్రూప్‌తో ఓ మహిళ ప్రాణం నిలబడింది. వివరాల్లోకి వెలితే.. అనంతపురం జిల్లాకు చెందిన జయలక్ష్మీ అనే మహిళ కడుపుతో ఉంది. ఆమెకు ఇటీవల ఆరోగ్యం విషమించగా..జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఆమెకు పరిస్థితి విషమించి రక్తం అవసరమైంది.

ఆమె రక్త నమునాలను పరీక్షించగా.. అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్‌గా తేలింది. స్థానికంగా బాంబే బ్లడ్ గ్రూప్ దొరకటం కష్టంగా మారింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు.. కర్నూలులోని డేనియల్‌ రాజు ఫౌండేషన్‌ ఫౌండర్‌ సుమన్‌కు ఫోన్‌ చేసి సాయం చేయాల్సింగా అభ్యర్థించారు. ఆయన వెంటనే నగరంలోని కర్నూలు బ్లడ్‌ బ్యాంక్‌కు ఫోన్‌ చేశారు. లక్కీగా అక్కడ బాంబే బ్లడ్ గ్రూప్‌ రక్తం నిల్వ ఉండటంతో వెంటనే అనంతపురానికి పంపించారు. ఆ రక్తాన్ని జయలక్ష్మికి ఎక్కించగా.. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం సకాలంలో దొరకటం వల్ల ఆమె ప్రాణాలతో బయటపడినట్లు డాక్టర్లు వెల్లడించారు.

బాంబే బ్లడ్ గ్రూప్ ప్రత్యేకత ఏంటంటే..
మామూలు బ్లడ్ గ్రూపులలోని ఎర్ర రక్త కణాల్లో షుగర్ మాలిక్యుల్స్ ఉంటాయి. ఆ మాలిక్యుల్స్ బ్లడ్ గ్రూపును నిర్ధారిస్తాయి. మాలిక్యుల్స్ కారణంగా ‘కేపిటల్ హెచ్ యాంటిజన్’ ఏర్పడుతుంది. అలాగే యాంటిజెన్ A, Bలు కూడా ఏర్పడతాయి. వీటన్నింటి ద్వారా బ్లడ్ గ్రూపు ఏర్పాడుతుంది. కానీ బాంబే బ్లడ్ గ్రూపులో షుగర్ మాలిక్యుల్స్ ఉండవు. కేపిటల్ హెచ్ యాంటిజెన్ కూడా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. అయినా వారి రక్తంలోని ప్లాస్మాలో మాత్రం యాంటీబాడీలు A, B, Hలు ఉంటాయి. అందుకే ఈ రక్తంలో మిగతా రక్త వర్గాలతో పోలిస్తే చాలా అరుదైనదిగా డాక్టర్లు చెబుతున్నారు. ఇండియాలో 179 మంది మాత్రమే ఈ బ్లడ్ గ్రూపును కలిగి ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి పది లక్షల మందిలో నలుగురికి మాత్రమే ఈ బ్లడ్ గ్రూపు ఉంది. అందుకే ఇది అత్యంత అరుదైన బ్లడ్ గ్రూప్.

ANN TOP 10