ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లుగీత కార్మికులు వినూత్నంగా ధన్యవాదాలు తెలిపారు. ‘గీతా కార్మిక బీమా’ ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. అభిమానం చాటుకున్నారు. పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కల గూడూర్ గ్రామంలో గీత కార్మికులు తాటిచెట్టు పైకి ఎక్కి ‘థాంక్స్ టూ కేసీఆర్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.ఈ సంధ్భంగా పాలకుర్తి జడ్పీటీసి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ .. గతంలో ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మరణిస్తే రూ.2 లక్షలు మాత్రమే పరిహారం వచ్చేదని, అది అందడంలోనూ తీవ్ర జాప్యం జరిగేదని పేర్కొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా తరహాలోనే కల్లుగీత కార్మికులకు కూడ వారం రోజుల్లోనే బీమా అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.









