AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటకకు బస్సు సర్వీసులు పెంపు.. టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులను మరింత పెంచింది. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, దావణగెరె ప్రాంతాలకు రాష్ట్రం నుంచి టీఎస్‌ఆర్టీసీ ఏసీ స్లీపర్, సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులను నడుపుతోంది. అయితే ఆదాయాన్ని పెంచుకోవడం, రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తాజాగా బస్సు సర్వీసులను మరింత పెంచారు. కర్ణాటకలోని ప్రాంతాలకు వెళ్లే బస్సులకు మంచి ఆదరణ ఉంటుంది. ప్రయాణికులతో ఈ బస్సులు నిండిపోతున్నాయి.

ప్రయాణికుల రద్దీ కారణంగా కర్ణాటకకు బస్సు సర్వీసులను పెంచినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి ఉద్యోగం, వ్యాపార రీత్యా చాలామంది కర్ణాటకకు ప్రయాణిస్తూ ఉంటారు. ప్రైవేట్ బస్సుల్లో టికెట్ల ధరలు అధిక మొత్తంలో ఉండటంతో ఎక్కువమంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రాష్ట్రం నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులను పెంచడం వల్ల సంస్థకు భారీగా ఆదాయం కూడా వస్తుందని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌తో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ANN TOP 10