AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఒఆర్ఆర్ లో పెద్ద కుంభకోణం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ఔట్‌రింగ్‌రోడ్డు కాంట్రాక్ట్‌లో పెద్ద కుంభకోణం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆదివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒఆర్‌ఆర్ కాంట్రాక్ట్ వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. ఒఆర్‌ఆర్‌ను ఎందుకు ప్రైవేట్‌పరం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఐఆర్‌బికి టెండర్ ఎందుకు ఇచ్చారని అడిగారు. ఒఆర్‌ఆర్ టెండర్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని కిషన్ రెడ్డి విమర్శించారు.

ANN TOP 10