AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పెళ్లి బృందం బస్సు బోల్తా.. ఐదుగురు మృతి..

ఉత్తర్ ప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా… మరో 15 మంది గాయపడ్డారు. జలౌన్ జిల్లా మధౌగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్‌పుర వద్ద పెళ్లి బృందంతో వెళ్తోన్న బస్సును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడి అందులోని వారు గాయపడ్డారు. ప్రమాద సమయానికి బస్సులో 40 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

పెళ్లివారితో బస్సు రెడ్‌ధార్ నుంచి రాంపురానికి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. వేడుక ముగించుకుని అర్థరాత్రి తిరిగి వస్తుండగా.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఘటన జరిగిన వెంటనే జలౌన్ పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తర్వాత రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బస్సు పడిపోవడంతో పైకప్పు విరిగిపోయింది.

ANN TOP 10