AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాజాసింగ్ కు బీఆర్ఎస్ నేత బంఫర్ ఆఫర్

గోషామహల్ బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ వినూత్న నిరసన చేపట్టారు. అబిడ్స్ లోని జీపీఓ కార్యాలయం ఎదురుగా రూ. 11లక్షల చెక్కు పోస్టర్ కార్డుతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ డబ్బుల కోసం ఏమైనా చేస్తాడని విమర్శిస్తూ.. తాను రాజాసింగ్ కు రూ.11 లక్షలు ఇస్తానని, ఆ డబ్బు తీసుకుని గోషామహల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. తొమ్మిదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధిని పని కూడా చేయలేదని మండిపడ్డారు. మతం పేరు, దేవుడిని అడ్డం పెట్టుకొని అమాయక ప్రజలను రాజాసింగ్ మోసం చేస్తున్నాడన్నారు. రానున్న రోజుల్లో రాజాసింగ్ ను ఓడించి, గోషామహల్ కు పట్టిన దరిద్రాన్ని తొలగిస్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ గెలుపుతోనే గోషామహల్ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

ANN TOP 10