ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఛేధు అనుభవం ఎదురైంది.మంత్రి సమావేశం కోసం సచివాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. గేటు దగ్గరే తనను అడ్డుకోవడంపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.సచివాలయంలోకి ఎందుకు వెళ్లనివ్వడం లేదని ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేకు సచివాలయంలోకి అనుమతి లేదా అని ఆగ్రహం చెందారు. సిటి ఎమ్మెల్యేలతో మంత్రి తలసాని సమావేశం ఉందని తెలిసి సెక్రటేరియెట్ కు వచ్చానని.. మంత్రిని కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేకే అనుమతి లేకపోతే.. సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని రాజాసింగ్ వాపోయారు.









