AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్ లోని బారాముల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్ హతమయ్యాడు.చనిపోయిన ఉగ్రవాది దక్షిణ కశ్మీర్ లోని కుల్గాం జిల్లాకు చెందినవాడుగా గుర్తించారు. నిన్న అదే ప్రాంతంలో సైనికులకు,ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని ఎస్ఎస్‎పీ అమోద్ అశోక్ మీడియాకు వివరించారు. బారాముల్లాలోని కర్హామా కుంజర్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం ఉందని.. దాంతో భద్రతా బలగాలు ఆ ఏరియాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయని వివరించారు.ఘటన ప్రాంతంలో గన్ లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. త్వరలో కశ్మీర్ లో జీ20 సదస్సు జరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు తెలిపారు.

ANN TOP 10