AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రగ్స్ ముఠాకు కింగ్ పిన్‌ అతడే..

హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. డ్రగ్స్ ఫెడ్లింగ్ చేస్తున్న నలుగురితో కలిసిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. 303 గ్రాముల కొకైన్ సీజ్ చేశామని తెలిపారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ డ్రగ్స్ ముఠాకు కింగ్ పిన్‌గా చింతా రాకేష్ అనే వ్యక్తి వ్యవహరిస్తున్నాడని వెల్లడించారు. చింతా రాకేష్ లోకల్‌గా ఇద్దరు పెడ్లర్‌లను హైర్ చేసుకున్నాడని తెలిపారు.

చాలాకాలంగా ఈ గ్యాంగ్ డ్రగ్స్ విక్రయిస్తోంది. వాట్సాప్ ద్వారా డ్రగ్స్ క్రయవిక్రయాలను కొనసాగించారు వాట్సాప్ చాట్ కూడా సంపాదించాం. విక్టర్ దగ్గర డ్రగ్స్ క్యాప్సూల్స్ దొరికాయి. వాస్తవానికి ఈ క్యాప్సూల్స్‌ను కడుపులో పెట్టుకొని అక్రమంగా తరలిస్తూ ఉంటారు. నిందితుల వద్ద సేకరించిన సమాచారం ప్రకారం డ్రగ్స్ వినియోగదారులు బిజినెస్ మాన్స్ కూడా ఉన్నారు. నిడిదలు పార్టీలకు కూడా ఒక అయిన సరఫరా చేసినట్టు తేలింది. నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి’’ అని పేర్కొన్నారు.

ANN TOP 10