నగరంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కోట్ల విలువ చేసే మత్తు పదార్థాలను సీజ్ చేశారు పోలీసులు. నైజీరియాకు చెందిన ప్రధాన నిందితుడితో పాటు మరో ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నైజీరియన్‌కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. కోట్ల రూపాయల కొకైన్‌ను సీజ్ చేశామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా.. విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.









