AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అతికించిన ఆస్పత్రి సిబ్బంది

గాయంతో ఆస్పత్రికి వెళ్లిన ఓ బాలుడికి కుట్లకు బదులు ఫెవిక్విక్ తో అతికించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలోని రెయిన్ బో ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసుగుర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం పెళ్లి వేడుక కోసం ఐజ పట్టణానికి వెళ్లారు. అక్కడ వంశీకృష్ణ, సునీత దంపతుల కుమారుడు ప్రవీణ్ ఆడుకుంటూ కిందపడిపోయాడు. దీంతో ప్రవీణ్ కు ఎడమ కంటిపై గాయమైంది. తల్లిదండ్రులు వెంటనే బాలున్ని హాస్పిటల్ కు తీసుకెళ్లగా.. ఆస్పత్రి సిబ్బంది గాయానికి కుట్లు వేయకుండా ఫెవికిక్ తో అతికించి పంపించారు. అది గమనించి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10