దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ట్రేడింగ్ చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. అమెరికాలోని ప్యాక్ వెస్ట్ బ్యాంక్ కార్ప్ పతనం అంచుకు చేరుకుందనే వార్తలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 694 పాయింట్లు నష్టపోయి 61,054కి పడిపోయింది. నిఫ్టీ 186 పాయింట్లు కోల్పోయి 18,069కి దిగజారింది.









