
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సంయుక్త. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ కేరళ కుట్టి. ఆ తర్వాత బింబిసార, సార్ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇటీవల విరూపాక్ష మూవీతో మరో హిట్టు కొట్టింది. దీంతో వరుస బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కళ్యాణ్ రామ్ సరసన డెవిల్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ.. కొన్ని పిక్స్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి.









