దక్షిణ భారత్ లో హాట్ టాపిక్ గా మారిన ది కేరళ స్టోరీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.కర్నాటక ఎన్నికల ప్రచారంలో బళ్లారిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీలో ఉన్నదంతా నిజమేనన్నారు. కేరళలో జరుగుతున్న ఉగ్రవాద కుట్ర సత్యాన్ని ఈ సినిమాలో బయటపెట్టారని మోడీ తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉగ్రవాదులతో కలిసి కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపుతుందని ఆరోపించారు.వారికి అండగా ఉంటూ తెరవెనుక రాజకీయలు చేస్తోందని మండిపడ్దారు.తీవ్రవాదం, ఉగ్రవాద ధోరణులపై తీసిన ది కేరళ స్టోరి సినిమాను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని మోడీ అన్నారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడతుందోని తీవ్రమైన ఆరోపణలు చేశారు.అలాంటి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకను కాపాడగలదా అని ప్రశ్నించారు. కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు భద్రతా వ్యవస్థ, శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. ఉగ్రవాదంపై బీజేపీ ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తోందని మోడీ స్పష్టం చేశారు.









