AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రైనేజీ క్లీన్ చేసిన తాటికొండ రాజయ్య..

పారిశుద్ధ్య కార్మికుడి చొక్క వేసుకున్న రాజయ్య స్టేషన్‌ఘనపూర్‌ మేజర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం ముందున్న డ్రైనేజీని శుభ్రం చేశారు. చీపురు పట్టుకొని పారిశుధ్య కార్మికులతో కలిసి పని చేశారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. తెల్ల పంచె, తెల్ల షర్ట్‌ వేసుకొని మంది, మార్బలాన్ని వెంటవేసుకొని దర్జాగా తిరిగే ఎమ్మెల్యే..షడన్‌గా మున్సిపల్‌ సిబ్బంది షర్ట్‌ వేసుకొని నియోజకవర్గ కేంద్రంలో మురుగు కాలువను శుభ్రం చేశారు. రాజయ్య ప్రవర్తన మొదట అందర్ని ఆశ్చర్యపరిచినప్పటికి అసలు కారణం తెలిసి అందరూ లైట్‌గా తీసుకుంటున్నారు. స్టేషన్‌ఘనపూర్‌ మేజర్‌ గ్రామపంచాయతీ కార్యాలయం ముందున్న డ్రైనేజీ కాలువను చీపర్లు పట్టుకొని శుభ్రం చేశారు రాజయ్య. ఎన్నికలు దగ్గరపడుతూ ఉండటం, అధిష్టానం పనితీరు సరిగా లేని వాళ్లకు టికెట్‌ ఇవ్వమని సంకేతం ఇవ్వడం వల్లే తాటికొండ రాజయ్య ఈవిధంగా మారిపోయారని నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటున్నారు.

ANN TOP 10