AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సమ్మెలో పాల్గొన్న ప్రొ.కోదండ రాం

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మెకు టీజేఎస్ అద్యక్షులు ప్రొ.కోదండ రాం మద్ధతు తెలిపారు. షాద్ నగర్ లో సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో పల్లెలకు ఉత్తమ అవార్డులు రావడంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పాత్ర కీలకమని కోదండరాం తెలిపారు. తెలంగాణను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న వారిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేని విధంగా .. 4 ఎండ్ల ప్రొబేషరీ పీరియడ్ విధించి.. ఉద్యోగ భద్రత లేకుండా చేశారని మండిపడ్డారు. నాలుగేళ్ల శిక్షణ కాలం పూర్తయినప్పటికీ.. రెగ్యులరైజేషన్ చేయకపోవడం దారుణమన్నారు.2018లో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాలని అని డిమాండ్ చేశారు.

ANN TOP 10