వైద్య శాస్త్రం మరో అద్భుతం జరిగింది. గర్భస్థ శిశువుకి అమెరికా వైద్యులు బ్రెయిన్ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. తల్లి గర్భంలో ఉండగానే శిశువుకు బ్రెయిన్ సర్జరీ నిర్వహించడం ప్రపంచంలో ఇదే తొలిసారని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. గర్భస్థ శిశువులో మెదడులో రక్తనాళాల అసాధారణ స్థాయిలో ఉన్నట్టు గుర్తించిన వైద్యులు.. శస్త్రచికిత్స ద్వారా సరిచేశారు. బోస్టన్‌లోని బ్రిగమ్ అండ్ ఉమెన్ హాస్పిటల్, బోస్టన్ చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ అరుదైన మెదడు పరిస్థితిని ‘వీనస్ ఆఫ్ గాలెన్ వైకల్యం’గా పిలుస్తారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
దీని ఫలితంగా అధిక మొత్తంలో సిరలు, గుండెపై రక్తం ఒత్తిడి తెచ్చి అనారోగ్య సమస్యలకు దారితీయవచ్చని నివేదించింది. ఈ సమస్య కారణంగా పుట్టిన తర్వాత శిశువు భయంకరమైన మెదడు గాయాలు, గుండె వైఫల్యం వంటి రెండు పెద్ద ముప్పును ఎదుర్కొంటారని బోస్టర్ చిల్డ్రన్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డారెన్ ఓర్బాచ్ తెలిపారు. సంక్లిష్టమైన శస్త్ర చికిత్స గురించి వివరాలను ఆయన వెల్లడించారు. సాధారణంగా శిశువులు పుట్టిన తర్వాత రక్త నాళాల్లో ప్రవాహాన్ని తగ్గించే చిన్న కాయిల్స్‌ను చొప్పించడానికి కాథెటర్‌ను ఉపయోగిస్తారని, ఇది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుందని తెలిపారు.
‘ఈ పరిస్థితి ఉన్న మొత్తం శిశువులలో 50 నుంచి 60 శాతం మంది వెంటనే చాలా అనారోగ్యానికి గురవుతారు.. మరణాలు రేటు దాదాపు 40 శాతం ఉన్నట్లు కనిపిస్తోంది.. బతికున్న శిశువులలో సగం మంది తీవ్రమైన నరాల, మెదడు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు’ అని ఓర్బాచ్ చెప్పారు.









