గాంధీభవన్ లో కీలక భేటీ జరిగింది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షత పీఈసీ సమావేశమైంది.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డి, ఈరవత్రి అనిల్, ఇతర కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 8వ తేదీన సరూర్ నగర్ లో జరగనున్న యువ సంఘర్షణ సభ, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పై చర్చించారు. ఈ సభకు ప్రియాంకగాంధీ ముఖ్య అతిథిగా వస్తుండటంతో.. సభను విజయవంతం చేసేందుకు అనుబంధ సంఘాల ఛైర్మన్ లతో చర్చించారు.సభ సక్సెస్ చేయడంలో క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు.









