AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రైనేజీలో పడిన ఆరేళ్ల బాలుడు.. కొనసాగుతున్న గాలింపు

విజయవాడ నగరంలో శుక్రవారం (మే 5) కురిసిన భారీ వర్షం గురునానక్‌ కాలనీలో తీవ్ర విషాదం నింపాయి. భారీ వర్షాలకు డ్రైన్ (మురుగు కాల్వ) పొంగి పొర్లింది. అభిరామ్ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ ఆ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయాడు. అతడి కోసం స్థానికులు, ఫైర్ సిబ్బంది గాలిస్తున్నారు. బాలుడు గల్లంతైన విషయం తెలుసుకొని తల్లిదండ్రులు కుప్పకూలారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తమ కళ్ల ముందే బాలుడు కాల్వలో పడి, చూస్తుండగానే ప్రవాహంలో కొట్టుకుపోయాడని.. బాలుడిని కాపాడలేకపోయామని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తోటి పిల్లలతో ఆడుకుంటూ అభిరామ్.. మురుగు కాల్వలో పడిపోయాడని చెప్పారు. బాలుడు ప్రమాదానికి గురైన చోట డ్రైనేజీకి పైకప్పు లేదు. దీంతో బాలుడు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు, డీఆర్‌ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డ్రైనేజీలపై పైకప్పు వేయాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ANN TOP 10