AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుల కూపీ లాగుతున్నారు సిట్ అధికారులు. ప్రశ్నాపత్రం లీక్ వెనుక నిందితులను ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసింది సిట్. వికారాబాద్ జిల్లాకు చెందిన అన్నదమ్ములు భగవంత్, రవికుమార్ లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న తన తమ్ముడు భగవంత్ కోసం.. రవికుమార్ డాక్యా నాయక్ నుంచి పేపర్ కొనుగోలు చేసినట్లు అధికారులు నిర్ధారించారు.డాక్యాకు రెండు లక్షలు ఇచ్చి ఏఈ పేపర్ కొన్నట్టు గుర్తించారు. డాక్యా నాయక్ బ్యాంక్ అకౌంట్ లు పరిశీలించగా.లావాదేవిల్లో తేడాలు దొరకపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ANN TOP 10