AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన

నేడు హనుమకొండ,వరంగల్‌ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.జిల్లా కేంద్రంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.హనుమకొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. హన్మకొండ కిట్స్ కాలేజీలో ఇంక్యుబేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. అనంతరం హెచ్ఓడీలు,విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు.అదేవిధంగా మర్యజీ స్కూల్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.గాంధీనగర్ లో మోడల్ వైకుంఠధామం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.తరువాత కాజీపేటలోBRS బహిరంగ సభకు కేటీఆర్ హాజరవుతారు.వరంగల్ లోనూ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు జిల్లా అధికార యంత్రాంగం,బీఆర్ఎస్ లీడర్లు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ రాకకు సర్వం సిద్ధం చేశారు. మరోవైపు కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పలువురిని ముందస్తు అరెస్ట్ చేశారు.

ANN TOP 10