AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేవుళ్ల మీద ఒట్టేయడం కేసీఆర్ కు కామన్:బండి

మిడ్ మానెరు నిర్వాసితులకు బీజేపీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామంలో మిడ్ మనేరు నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అత్తగారు ఊరు మీ నిర్వాసిత గ్రామమేనని..సొంతవారి గ్రామాలను కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు.అన్ని దేవాలయాలకు వెళ్ళడం.. ఒట్టు వేయడం సీఎం కేసీఅర్ కి కామన్ అయిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ చెల్లని చెక్కు అని ఎద్దేవ చేశారు. వేములవాడ రాజన్న సాక్షిగా నిర్వాసితులు ఆదుకుంటానని చెప్పానని మోసం చేశారన్నారు.నిర్వాసితులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ముంపు గ్రామాలను కలిపి ఇండస్త్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు పంపిస్తే.. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నుండి సహకరిస్తామని చెప్పారు.నిర్వాసితుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం కోసం బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు.

ANN TOP 10