బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీ ఆఫీస్ కు వెళ్లారు.తనకు ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేయాలని పోలీసులను కోరారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. సెక్యూరిటీ పెంచాలని ఆయన కోరారు.జూబ్లీహిల్స్ రేప్ కేసులో ప్రముఖులకు సంబంధించి ముద్దాయిల కేసు విషయంలో లేదా మంత్రుల మీద ఇస్తున్న సాక్ష్యాలు, ఆధారాలు లేదా ఔటర్ రింగ్ రోడ్డు టోల్ గేటుకు సంబంధించి విమర్శల నేపథ్యంలో తనకు సెక్యూరిటీని పెంచమని కోరినట్లు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు దరఖాస్తు ఇచ్చానని .. కానీ ఇంతవరకూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘునందన్ రావు తెలిపారు. అందుకే మరోసారి దరఖాస్తు ఇచ్చేందుకు వెళ్లానన్నారు.డీజీపీ అందుబాటులో లేకపోవడంతో అడిషనల్ డీజీపీకి దరఖాస్తు ఇచ్చానన్నారు.తన భద్రతతో పాటు 2014 నుండి పోలీస్ శాఖ కొనుగోలు చేసిన వాహనాల గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినట్లు చెప్పారు.









