AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వారికి అండగా ఉంటా: పీటీ ఉషా

లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లను భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కలిశారు. జంతర్ మంతర్ వద్దకు వెళ్లి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. రెజ్లర్లకు అండగా ఉండి న్యాయం చేస్తానని పీటీ ఉష తమతో చెప్పారని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని రెజ్లర్ భజరంగ్ పూనియా మీడియాకు తెలిపారు. కాగా భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ టాప్ రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత 11 రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాను కొనసాగిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ జైలుకు వెళ్లేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ANN TOP 10