AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేర్వేరు మత గ్రంథాలుండొచ్చు.. కానీ అందరికీ రాజ్యాంగం ఒక్కటే: ఎంపీ

దేశంలోని భిన్న మతస్తులకు వారి మత గ్రంథాలు ఉంటాయి కానీ.. అన్ని మతస్తులకు ఒకే రాజ్యాంగం ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.ప్రపంచ ఖ్యాతిని పొందిన గొప్ప రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూర్ లో ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ సెక్రెటరీయేట్ కు భారత రత్న బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టలేదని.. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ యే మన సెక్రటేరియెట్ కు అంబేద్కర్ పేరు పెట్టి సత్కరించారన్నారు.అదేవిధంగా దళితబంధుతో దళితుల అభ్యున్నతికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.

ANN TOP 10