AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ దృష్టిసారించింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. ఆసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ఓటరు జాబితా సంబంధిత అంశాలపై వివిధ రాజకీయ పార్టీలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ,సీపీఎం,మజ్లీస్ పార్టీల ప్రతినిధులతో ఈసీ సమావేశమైంది.షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో ఎన్నికలుంటాయని, నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎస్‌ఈసీ తెలిపింది.రాజకీయ పార్టీల ప్రతినిధులు ఐటీ చర్యలను వివరించాలని కోరారు. ఒకే ఇంట్లో ఎక్కువగా నమోదైన ఓట్లపై దృష్టిపెట్టాలని ఈసీ సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి.. సన్నాహకాలు ప్రారంభించినట్లు వికాస్ రాజ్ వివరించారు.

ANN TOP 10