AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మనోబాల మరణ వార్త విని షాక్ అయ్యా

ప్రముఖ హాస్యనటుడు మనోబాల మృతి పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. “ఫేమస్ డైరెక్టర్, యాక్టర్.. నా ఫ్రెండ్ మనోబాల మరణ వార్త విని షాక్ అయ్యాను. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. మనోబాల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న. అంటూ ట్వీట్ చేశారు రజిని. ఇక రజనీకాంత్, మనోబాల కలిసి చంద్రముఖి,లింగా,కథానాయకుడు వంటి చిత్రాల్లో నటించారు. అంతేకాదు.. మనోబాల డైరెక్ట్ చేసిన నాలుగు సినిమాల్లో కూడా నటించారు రజినికాంత్. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆయన బుదవారాం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

తమిళ్ తో తెలుగు ప్రేక్షకలను కూడా ఆయన అలరించారు. ఆయన మృతి పట్ల తమిళ, తెలుగు ఇండస్ట్రిల ప్రముఖులు సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా కొంత కాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన.. తెలుగులో చివరగా చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య మూవీలో జేడ్జ్ పాత్రలో కనిపించారు.

ANN TOP 10