హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు(బుధవారం) దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం.
ఢిల్లీలో నిర్మించిన బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని మే 4న సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించనున్నారు. బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు జాతీయస్థాయిలో కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ఢిల్లీలో శాశ్వత కార్యాలయాన్ని నిర్మించారు. జాతీయస్థాయి పార్టీ కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచి నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదికి తీసుకురావడం, సదస్సులు, సమావేశాలకు పార్టీ కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ స్థాయి బీఆర్ఎస్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరగనున్నాయి.









