AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెర్రి వేయి విధాలు అంటే ఇదే!

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆర్టీసీ సర్వీసులకు సంబంధించిన ప్రత్యేకమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కొన్ని కొన్ని విషయాలపై సీరియస్ గా కూడా స్పందిస్తారు.తాజాగా ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోపై ఆయన ట్విట్టర్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు.బైక్‌పై వెళ్తూ హైదరాబాద్ సిటీ బస్సును వెనక నుంచి కాలితో నెడుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మిథానీ డిపోకు చెందిన బస్సు 104-రూట్‌లో ప్రయాణిస్తుండగా స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడు బస్సును కాలితో ముందుకు నెడుతున్నట్టుగా పోజిచ్చాడు. ఇది కాస్త నెట్టింట హల్ చల్ కావడంతో.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వారికి వార్నింగ్ ఇచ్చారు.సోషల్ మీడియాలో పాప్యులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని చెప్పారు. నడిరోడ్డుపై ఇలాంటి ఫీట్లు చేసి ప్రమాదాలపాలై తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని సూచించారు. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు.

 

ANN TOP 10