ఖమ్మం నగరంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వివాహితను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు.గత నెల 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వరంగల్ జిల్లా చెన్నారవు పేట రామన్న గుట్ట తండాకు చెందిన బానోత్ లీల.. గత నెల 27న తన అత్త వైద్యం కోసం ఖమ్మంకు వచ్చింది. అదే రోజు గుర్తు తెలియని దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడ్డారు. 28 నాడు ఉదయం మహిళను జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వదిలివెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.









