హైదరబాద్: నేడు రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను కేటాయించనున్నారు. నాగోల్ బండ్లగూడ, పోచారంలలో మిగిలిన ఫ్లాట్లకు నేడు లాటరీ తీయనున్నట్లు అధికారులు వెల్లడించారు. లాటరీ ప్రక్రియ పారదర్శకంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 15 నాటికి టోకెన్ అడ్వాన్స్ కట్టిన వారి పేర్లతో పారదర్శకంగా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి పోచారం, బండ్లగూడలో మిగిలిపోయిన ఫ్లాట్ల కేటాయింపులు లాటరీ ప్రక్రియలో ఎంపిక చేయనున్నారు.









