AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మిపై ఐటి దాడులు

హైదరాబాద్: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లోని కళామందిర్, కాంచీపురం వరమహాలక్ష్మి వ్యాపార సంస్థలపై ఐటి దాడులు చేసింది. ప్రముఖ వస్త్ర వ్యాపారి ఇంట్లో ఐటి సోదాలు నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటి దాడులు కొనసాగుతున్నాయి.

కళామందిర్ షాప్ డైరెక్టర్ల ఇళ్లలోనే ఈ సోదాలన్నీ జరుగుతున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ఆరు గంటలకే డైరెక్టర్లు శిరీష చింతపల్లి, ప్రమోద్‌ ఇళ్లకి ఐటీ అధికారులు చేరుకున్నారు. నాలుగు గంటలుగా ఇద్దరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖ షాపుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని త్వరలో అప్‌డేట్ చేయడం జరుగుతుంది.

ANN TOP 10