థాయిలాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది.థాయిలాండ్‌లోని పటాయలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఇందులో క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కూడా ఒకరు.పటాయలో ఓ హోటల్‌లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు.. దాడులు నిర్వహించారు.ఆ సమయంలో అక్కడే ఉన్న భారతీయులతో పాటు పలువురు విదేశీయులు, 14 మంది మహిళలు, మొత్తం 90 మందిని అరెస్ట్ చేశారు.చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే గ్యాంబ్లింగ్ నడుస్తున్నటు తెలుస్తోంది.నిందితుల నుంచి రూ.20 కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్, భారతీయ నగదును థాయ్‌లాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్ట్ అయిన వాళ్లలో మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. గేమ్స్ ఆడేందుకు పెద్ద ఎత్తున భారతీయులను చికోటి థాయ్‌లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది.









