AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దూకుడు పెంచిన ఈడీ.. వారికి నోటీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది.ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ.. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది.దీంతో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా ఆ ఇద్దరి స్టేట్మెంట్‌లను ఈడీ నమోదు చేస్తోంది. ఇక, టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రూ. 31 లక్షల లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించినట్లు సమాచారం. కాగా, ఈ కేసును ఓ పక్క తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తుండగా.. ఈ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచడం హాట్ టాపిక్‌గా మారింది.

ANN TOP 10