తెలంగాణ ఎంసెట్ హాల్ టిక్కెట్లను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనివెల్లడించారు. eamset అగ్రికల్చర్, మెడికల్ మరియు ఇంజనీరింగ్ పరీక్షలు మే 10 నుండి 14 వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు హాల్ టిక్కెట్లను eamcet.tsche.ac.in వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి.. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో లాగిన్ కావాలి. తెలంగాణ ఎంసెట్ పరీక్షలను JNTU హైదరాబాద్ నిర్వహించనుంది.
హాల్ టిక్కెట్లను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ముందుగా eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో లాగ్ ఇన్ అవ్వాలి. హోమ్ పేజీలో TS EAMCET హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లింక్‌పై క్లిక్ చేయాలి. అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత గల పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి .. మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.









