AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మరో మూడు రోజులు ఈ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లు జలమయమయ్యాయి. భారీగా వర్షపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కాగా, మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీతోపాటు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఏపి, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ANN TOP 10