AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాలేరు నుంచే పోటీ చేస్తా.. వైఎస్ షర్మిల

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం పర్యటించారు. పాలేరు వైఎస్సార్‌టీపీ కార్యాలయంలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా షర్మిల జెండాను ఆవిష్కరించారు. షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్ బిడ్డ పాలేరులోనే పోటీ చేస్తుందని, ఎవరికి ఎటువంటి అపోహలు అవసరం లేదని షర్మిల క్లారిటీ ఇచ్చారు. కార్మికుడు లేకపోతే మెతుకు లేదని, ఇంటికి వెలుగు లేదని తెలిపారు.

దేశం పురోగతికి కార్మికులు అవసరమని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్మికులకు సలాం చెప్తుందని షర్మిల చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని, కేసీఅర్ కార్మికులను పురుగుల్లా చూస్తున్నారని విమర్శించారు. కార్మికులను కేసీఆర్ ఎడమ కాలు చెప్పు కింద తొక్కి పెట్టారని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేశారని, ఆర్టీసీ కార్మికులు హక్కుల కోసం పోరాటం చేస్తే కనీసం గౌరవం కూడా ఇవ్వలేదని అన్నారు. కార్మిక సంఘాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని షర్మిల ఆరోపించారు.

కేసీఆర్‌కు బానిసలా బ్రతకాలా..? కనీసం వేతనాలు కూడా తెలంగాణలో అమలు కావడం లేదని షర్మిల అన్నారు. కార్మిక చట్టాల ప్రకారం రూ.26 వేలు కనీస జీతం ఉండాలని, తెలంగాణలో రూ.10 వేలు కూడా జీతం లేదని అన్నారు. రాష్ట్రంలో కోటి మంది కార్మికులు ఉన్నారని, కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు లేవన్నారు. కార్మిక సక్షేమం కోసం ఎటువంటి బోర్డులు కూడా లేవని, సంక్షేమానికి ఎటువంటి నిధులు కూడా లేవని షర్మిల గుర్తు చేశారు.

ANN TOP 10