రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. మధురానగర్ కాలనీలో చిన్న పిల్లలు, ఒంటరిగా వెళ్తున్నవారిపై విచక్షణా రహితంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచాయి. ఓ చిన్నారితో పాటు మరో నలుగురిపై కుక్కుల దాడి చేశాయి. దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. అవి భయంకరంగా ఉన్నాయి. చిన్నారి ముఖంపై విచాక్షణారహితంగా దాడి చేయటంతో రక్తసిక్తమైంది. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీధి కుక్కల దాడుల పట్ల కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులకు సమాచారం అందించినా స్పందన లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్రంలో వీధికుక్కల దాడులు ఆగటం లేదు. ఎక్కడో ఓ చోట వీధి కుక్కలు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నాయి. కుక్కల భయానికి ప్రజలు ప్రజలు రోడ్లపైకి రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. వీధుల్లో ఒంటరిగా నడవటానికి హడలిపోతున్నారు.









