AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిన్నారి మౌనిక మృతిపై హైకోర్టుకు లేఖ

నగరంలోని సికింద్రాబాద్‌లో నాలాలో పడి చిన్నారి మౌనిక మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టుకు (Telangana High Court) లేఖ రాశారు. జీహెచ్ఎంసీ (GHMC) అధికారులను నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మరణించిందంటూ ఫిర్యాదు చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి మాన్ హోల్స్ కారణంగా అనేకమంది చనిపోతున్నారని లేఖలో తెలిపారు.

మ్యాన్ హోల్స్ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్మాసనానికి తెలిపారు. చిన్నారులు చనిపోతున్నా జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. చిన్నారి మృతి కారణమైన జీహెచ్ఎంసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ లేఖ రాశారు.

ANN TOP 10