AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆనంద్ మోహన్ విడుదలపై ఒవైసీ ఆగ్రహం

బీహార్ రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ విడుదలపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనంద్ మోహన్ విడుదల కావడం.. కృష్ణయ్యను రెండోసారి హత్య చేయడమే అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీహార్ ఐఏఎస్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు బీహార్‌లో ఏ ఐఏఎస్ అధికారి అయినా.. తన ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తారా అని Asaduddin Owaisi నిలదీశారు.

1994 డిసెంబర్ 5న 37 ఏళ్ల వయసులో దళిత ఐఏఎస్‌ అధికారి కృష్ణయ్యను హత్య చేశారని అసదుద్దీన్ ఒవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణయ్య కూలి పని చేస్తూ.. చదువుకున్నారని వివరించారు. కృష్ణయ్య కుటుంబానికి తాను అండగా ఉంటానని.. ఆనంద్ మోహన్ విడుదల కావడంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బీహార్ ప్రభుత్వం జైలు నిబంధనలలో మార్పులు చేసి.. ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం చేసిందనే విమర్శలు ఉన్నాయి.
పాక్ ఆయుధ డిపో పోలీస్ స్టేషన్‌లో పేలుళ్లు

దీనిపై ఒవైసీ కూడా పలు ప్రశ్నలు సంధించారు. బీహార్‌లో మరోసారి సన్‌లైట్, రణ్‌వీర్ సేన రాబోతోందా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు. గతంలో బిల్కీలపై అత్యాచారం చేసిన వారిని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయగా.. ఇప్పుడు బీహార్ ప్రభుత్వం మరో దోషిని విడుదల చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏం సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు. బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులు విడుదలైనప్పుడు.. బీజేపీ నాయకులెవ్వరూ వారికి వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తు చేశారు.

ANN TOP 10