AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈడీపై కవిత పిటిషన్..

ఢిల్లీ : ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను త్వరగా విచారణ చేపట్టాలని జస్టిస్ రస్తోగి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మెన్షన్ చేశారు. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ చేయొచ్చా అనే అంశాన్ని సవాల్ చేస్తూ గతంలో కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే సోమవారం కవిత పిటిషన్ విచారించాలని ధర్మాసనానికి కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. అభ్యర్థనను పరిశీలిస్తామని జస్టిస్ రస్తోగి ధర్మాసనం తెలిపింది.

ఈడీపై ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో గత నెలలో విచారణ జరిగింది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు సుప్రీంకోర్టు ట్యాగ్‌ చేసింది. కవిత తన పిటిషన్‌లో సరికొత్త అభ్యర్థన చేశారు. మద్యం పాలసీ కేసు విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి కవిత తరఫున వాదనలు వినిపించారు. ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు.

ANN TOP 10