AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్.. నేటి నుంచి ఆ టికెట్ రేట్లు తగ్గింపు

ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారికి ఆర్ధిక భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రయాణికుల T-24 టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటిజన్లకు T-24 టికెట్‌లో రాయితీ కల్పించాలని నిర్ణయించింది. వారికి రూ.80కే ఆ టికెట్‌ను అందించనుంది. 60 ఏళ్ళు పైబడిన వారికి T-24 టికెట్‌లో 20 శాతం డిస్కౌంట్ వర్తిస్తుంది. టికెట్ తీసుకునే సమయంలో వయసు ధ్రువీకరణ కోసం సీనియర్ సిటిజన్లు తమ ఆధార్ కార్డ్‌ను బస్ కండక్టర్లకు విధిగా చూపించాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త T-24 టికెట్ ధరలు నేటి నుంచి (ఏఫ్రిల్ 27) నుంచి అమల్లోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రయాణించే వారి కోసం గతంలో T-24 టికెట్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ టికెట్‌ను కొనుగోలు చేస్తే.. సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో 24 గంటల పాటు రెండు జంట నగరాల్లో (హైదరాబద్, సికింద్రాబాద్) ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. మొదట ఆ టికెట్ ధరను రూ.120గా నిర్ణయించగా.. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆ తర్వాత T-24 టికెట్ ధరను 100కి తగ్గించింది. తాజాగా సాధారణ ప్రయాణికులకు T-24 టికెట్ ధరను రూ.90 కి, సీనియర్ సిటిజన్లకు రూ.80 కి తగ్గిస్తూ టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఫ్యామిలీ-24 టికెట్‌ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. రూ.300 చెల్లించి నలుగురు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు 24 గంటల పాటు ప్రయాణించచవచ్చని వెల్లడించారు.

ANN TOP 10