AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆన్​లైన్ ​క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

నల్లగొండ జిల్లాలో ఆన్​లైన్​క్రికెట్​బెట్టింగ్​నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.12 కోట్ల నగదు, 2 కార్లు, 14 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను జిల్లా పోలీస్​ఆఫీసులో ఎస్పీ కె.అపూర్వరావు తెలియజేశారు. మిర్యాలగూడ వన్​టౌన్‌‌ పరిధిలోని మయూరినగర్ హౌసింగ్ బోర్డులో ఉన్న సాయిదత్త అపార్ట్‌‌మెంట్‌‌ ఫ్లాట్ నంబర్​303లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో వన్​టౌన్ సీఐ రాఘవేందర్, ఎస్ఐ శివ తేజ్, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కట్టంగూర్ ఎస్ఐ విజయ్ కుమార్, మిర్యాలగూడ టూ టౌన్ ఎస్​ఐ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ రవి, రహమాన్​ రైడ్​ చేశారు.

బెట్టింగ్ నిర్వహిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మిర్యాలగూడ మయూరినగర్​కు చెందిన బంటు రాజేశ్​, ఖమ్మం జిల్లా బోనకల్​కు చెందిన కోల సాయికుమార్, రాచబంతి జీవన్​కుమార్, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన నోట్ల సత్యనారాయణ, ఖమ్మం జిల్లాకు చెందిన శాకమూరి ఉదయ్​కుమార్​, మిర్యాలగూడ గాంధీనగర్​కు చెందిన బంటు సంతోష్​, గంధం నవీన్​కుమార్​, బంటు వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా ప్రకాశ్​నగర్​కు చెందిన కొండవేటి రాజేశ్​ఉన్నారు.

ANN TOP 10