AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీడియా గొంతు నొక్కేందుకు జోగు కుట్రలు

బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఫైర్‌

ఆదిలాబాద్‌: మీడియా గొంతు నొక్కేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న కుట్రలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం ఎదుట పార్టీ నాయకులు, అమ్మన్యూస్‌ అభిమానులు, ప్రజలతో కలిసి ఆందోళనకు దిగారు. ఫ్ల కార్డులు చేతబట్టుకుని బీజేపీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అమ్మన్యూస్‌పై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను దెబ్బతీయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమ్మన్యూస్‌పై అక్రమంగా బనాయించిన కేసులను తక్షణం తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ANN TOP 10