AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాయల తెలంగాణ ఇప్పట్లో సాధ్యం కాదు:మంత్రి

రాయల తెలంగాణ అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. రాయల తెలంగాణ అనేది ఇప్పట్లో సాధ్యం కాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే రాయల తెలంగాణ అనే అంశం తెరపైకి వచ్చిందని అన్నారు. రాయల తెలంగాణ కానీ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కానీ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కలపాలని తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కోరడం కేసీఆర్ పాలనకు నిదర్శనమన్నారు. తెలంగాణాలో కలపండి.. లేకపోతే మా దగ్గరికి రండి అని కేసీఆర్ ని ప్రజలు ఆహ్వానిస్తున్నారన్నారు.తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారని.. ఆంధ్రప్రదేశ్ ను కూడా సువర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని.. వెనుకబాటుకు కారణమైన పరిపాలకుల మీద ఆంధ్రప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు.కాగా రాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ANN TOP 10