సచిన్ టెండూల్కర్ కు సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ చేనేత కళాకారుడు సచిన్‌కు వినూత్న రీతిలో బర్త్‌డే విషెస్ చెప్పారు. చేనేత మగ్గంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి ఫోటోను నేశారు చేనేతకారుడు వెల్ది హరిప్రసాద్. తాను రూపొందించిన ఈ కళాఖండాన్ని సచిన్ మిత్రుడు, భారత మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్‌కు అందజేశారు హరి ప్రసాద్. నేడు గోవాలో జరిగిన సచిన్ జన్మదిన వేడుకలలో సచిన్ దంపతులకు చాముండేశ్వరీనాథ్ ఈ కానుకను అందజేశారు.
మగ్గంపై సచిన్ దంపతుల రూపాలను నేయడానికి 20 రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్ తెలిపారు. 47 ఇంచుల వెడల్పు, 60 ఇంచుల పొడవు, 290 గ్రాముల బరువుతో ఈ రూపాన్ని తీర్చిదిద్దారు. 170 గ్రాముల వెండి పోగులు, పట్టు దారంతో ఈ వస్త్రాన్ని (చీర) తయారు చేశానని వెల్ది హరిప్రసాద్ తెలిపారు.









