సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సారి చందనోత్సవ ఏర్పాట్లు అధ్వానంగా నిర్వహించారన్నారు. గర్భాలయంలో పోలీసుల జులుం ఎక్కువైందని ధ్వజమెత్తాహరు. గర్భాలయంలో ఆచారాలను మంటగలిపారని మండిపడ్డారు. క్యూలైన్లలో భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు స్వామి వారి దర్శనానికి ఎందుకు వచ్చానా..? అని బాధపడుతున్నట్లు వెల్లడించారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారని స్వామి స్వరూపానందేంద్ర మండిపడ్డారు.
ఈ సంవత్సరం అంత వరస్ట్‌గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదు. గర్భాలయంలో పోలీసుల జులుం ఎక్కువైంది. భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు లేవు. ప్రతి సంవత్సరం మమ్మల్ని అడిగేవారు. ఈ సంవత్సరం మమ్మల్ని అడగకుండా ఇష్టారాజ్యంగా చేశారు. ఇది పోలీసుల రాజ్యంలా అయిపోయింది. భక్తులకు చేరువగా భగవంతుడు ఉండేటట్లుగా లేదు. గత ఆరు నెలలుగా ఇక్కడ ఈవో లేకపోవటం దారుణం. ఎకడెక్కడి నుంచో భక్తులు వస్తే.. వీఐపీ టికెట్లు పోలీసుల ద్వారా అమ్మించారు. అసలు గర్భాలయం చూస్తే భయమేస్తుంది. పోలీసులు, ధనాలు.. గర్భాలయంలో ఏ మాత్రం ఆచారాలు, మడి, సంప్రదాయం లేకుండా పోయింది.
ఇది చాలా దారుణం. సింహాచలం చరిత్రలో ఇది దుర్మార్గమైన రోజుగా చెప్పొచ్చు. ఇక్కడున్న భక్తులను చూస్తే కళ్లవెంట నీళ్లొస్తున్నాయి. అసలు నేను ఈరోజు ఎందుకు దర్శనానికి వచ్చానా అనిపించింది. చిన్నపిల్లలతో ఎంతో మంది దర్శనానికి వచ్చారు. కొండ కింద వరకు జనాలే. ఈ వీఐపీల దర్శనం ఏంటి ? ఇది పేదల దేవుడు. ధనవంతుల దేవుడు కాదు. పేదలకు దేవుణ్ణి దూరం చేయడం కరెక్ట్ కాదు.” అని స్వరూపానందేంద్ర ఫైరయ్యారు.









