AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నల్లగొండ నుండి పోటీ చేయడం ఖాయం: వెంకట్ రెడ్డి

ఈ నెల 28న మహత్మా గాంధీ యూనివర్సిటీలో తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ దీక్ష గురించి తనకు పూర్తిగా తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.జూన్ మొదటి వారంలో భట్టి విక్రమార్క యాత్ర సంధర్బంగా నల్లగొండలో సభ ఉంటుందని..ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.నల్లగొండ పట్టణంలో ఆయన రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ అసెంబ్లీ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని.. తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిపించాలని వెంకట్ రెడ్డి కోరారు. ఇరవై ఏళ్ళు నిజాయితీగా పని చేసి అభివృద్ధి చేశానని, ఆపదలో ఉన్న అందరికి సేవ చేశానని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ పెంచాలన్నారు. నల్లగొండను దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్.. ఇక్కడి ముస్లింలు,దళితులు, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10